కేబుల్ వంతెన తెగిపోయిన ఘటనలో 141కు చేరిన మృతులు

సోమవారం, 31 అక్టోబరు 2022 (09:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన కేబుల్ వంతెన శనివారం తెగిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 141కిపైగా చేరింది. ప్రమాద సమయంలో వంతెనపై 500కు పైగా పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన అనేక మంది పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే సహాయక సిబ్బంది కూడా 170 మందికి వరకు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గల్లైంతవారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, వందేళ్ల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పను చేశారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించి, పర్యాటకులను అనుమతించారు. ఆదివారం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ వంతెనపైకి వచ్చి మృత్యువొడిలోకి చేరుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు