అప్పటికే జ్వరం, హైపర్‌టెన్షన్, హైపోథైరాయిడ్, మధుమేహం, పేగు సమస్యలకూ చికిత్సలు అందించారు. స్టెరాయిడ్స్ ఇచ్చారు. కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా, ఎడమ జఠరిక లోపాలున్నట్లు అదేరోజు బయటపడ్డాయి. తన చివరి రోజుల్లో ఆస్పత్రిలో బాధాకరస్థితిలో ఉన్నట్లు తేలింది.
జయలలిత అక్టోబరు 19న మాట్లాడారు. 22న సంజ్ఞలకు స్పందించడం మొదలుపెట్టారు. 29న రాత్రి ఆమెకు గుండె కొట్టుకోవడంలో సమతుల్యత లోపించింది. ఛాతీలో తీవ్ర నొప్పిగా ఉందని ఆమె వైద్యులకు చెప్పారు. ఇలా జయలలిత ఆరోగ్యంపై ఆమెకు అందిన చికిత్స, చివరి రోజుల్లో ఆమె పడిన ఇబ్బందులన్నీ ఆరుముగం నివేదికలో వెల్లడి అయ్యాయి.