వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

ఐవీఆర్

శనివారం, 23 నవంబరు 2024 (16:24 IST)
వైసిపికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వెంకట రమణ తన పదవికి రాజీనామా చేసారు. కైకలూరుకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులు ముందు వైసిపిలో చేరారు. ఆయన చేరిన వెంటనే ఎమ్మెల్యే కోటా కింద ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది వైసిపి.
 
ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అప్పట్నుంచి వెంకట రమణ వైసిపికి అంటీముట్టనట్లు వుంటున్నారు. ఈరోజు వైసిపి పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ ఆ పత్రాలను పార్టీ కార్యాలయానికి పంపించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు