హీరో రోషన్ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ ఛాంపియన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను , జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛాంపియన్ ఫస్ట్ లుక్, ఆసక్తికరమైన టీజర్ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా హీరోయిన్ ను పరిచయం చేశారు.