హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన "లిటిల్ హార్ట్స్" సినిమా రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి 4 రోజుల్లో 15.41 కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి. చిన్న చిత్రాల్లో ఈ రేంజ్ వసూళ్లు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ మరిన్ని గ్రేట్ నెంబర్స్ "లిటిల్ హార్ట్స్" క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ, సినిమా చూశాను, కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని, కంటెంట్ క్రియేట్ చేయగలిగిన వాడే నిజమైన తోపు అని ప్రూవ్ అయ్యింది. కాలం మారింది, మనం కూడా మారకపోతే ఎవరినో నిందిస్తూ బతకాలి, "లిటిల్ హార్ట్స్" బ్యూటిఫుల్ ఫిలిం, ఒక్క 5 నిమిషాలు కూడా మన మొహం మీద చిరునవ్వు పక్కికి పోదు. మార్తాండ్ సాయి, ఆదిత్య హాసన్, సింజిత్, మౌళికి నా ప్రశంసలు. ప్రతి రెండేళ్లకో, మూడేళ్లకో ఎవడో వచ్చి ఇలా బాక్సాఫీస్ లు బద్దలుకొట్టి పోతుంటాడు, మనకు బుద్ధి రాదు, అంతే..' అంటూ పేర్కొన్నారు.