ఏపీ అసెంబ్లీ సమావేశాలు: పెషావర్ ఘటనకు సంతాపం వాయిదా..

గురువారం, 18 డిశెంబరు 2014 (12:01 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో గెలిచాడంటే ఆయనకు ఎంత పాప్యులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పారు. 
 
ఏపీ శాసనసభ శుక్రవారానికి వాయిదాపడింది. శీతాకాల సమావేశాలు ఈ ఉదయం ఆరంభం కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై నేతలు మాట్లాడారు. దాని తర్వాత, పెషావర్ లో మరణించిన వారికి సభ సంతాపం తెలిపింది. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి