48 గంటల్లోనే 10 అంతస్తుల భవన నిర్మాణం... అమరావతిలో అధునాతన టెక్నాలజీ...

సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భవనాల నిర్మాణాలను చిటికెలో రెడీ చేసేందుకు పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సీఆర్డీఎ పరిధిలో భారీ భవనాలు, కారిడార్స్, ఇతర ప్రాజెక్టులను నిర్మించేందుకు భారీ నిర్మాణ సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయి. 10 అంతస్తుల భవనాన్ని కేవలం 10 మందితో మూడు నెలల్లో పూర్తి చేస్తుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ చేసి చూపిస్తాయి. 
 
ఇంకా వేగంగా నిర్మాణం జరగాలని కోరితే 48 గంటల కాలంలోనే పది అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తక్కువ సమయంలోనే ఇలాంటి నిర్మాణాలను పూర్తి చేయగల సామర్థ్యం ఈ సంస్థలకు ఉంది. ఇప్పటికే ఇలాంటి కట్టడాలను దేశంలో చాలాచోట్ల విజయవంతంగా నిర్మించి ఇచ్చాయి. అదెలాగంటే... గోడలు, స్తంభాలు, శ్లాబులు ఇత్యాది నిర్మాణాలను వేరేచోట తయారుచేసి ఇక్కడకు తెచ్చి నిర్మించేస్తారు. అలా అమరావతిలో ఐదేళ్ల లోపే ఆకాశ హర్మ్యాలను చూడవచ్చన్నమాట. 

వెబ్దునియా పై చదవండి