పోలవరంతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పోలవరం గ్రౌండ్ ఇంజనీరింగ్ పనులు చేపట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఐడీసీ విశ్వకర్మ 2018 అవార్డు రావడంతో టీమ్‌ని చంద్రబాబు అభినందించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4% పూర్తయ్యింది.
కుడి ప్రధాన కాలువ 91% ఎడమ ప్రధాన కాలువ 59.6% హెడ్ వర్క్స్ 41.2% మొత్తం తవ్వకం పనులు 70% పూర్తి అయ్యాయి. (1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 778.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి) స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16% పూర్తి. డయాఫ్రమ్ వాల్ 72% పూర్తి. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తి అయ్యానని చెప్పారు.
స్పిల్‌వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించింది, మరో 16 డిజైన్లను సమర్పించడం జరిగింది. స్పిల్ వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, స్పిల్ చానల్ బ్రిడ్జి, డయాఫ్రమ్ వాల్, రేడియల్ గేట్ల నిర్మాణం ద్వారా వరద నీటి మళ్లింపునకు మొత్తం రూ. 9,189.81 కోట్ల వ్యయం. ఇప్పటివరకు రూ. 3,448.29 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పనులు పూర్తి చేసేందుకు ఇంకా రూ. 5,741.52 కోట్ల నిధులు అవసరం. మే నాటకి డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తవుతాయని చంద్రబాబుకు అధికారులు వివరించారు.