ఈ రోజు రంజాన్ సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఏ మతం వాళ్లు అయినా రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా బతికే ధైర్యం తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలను ప్రాసిక్యూట్ చేస్తామంటే మొదట వ్యతిరేకించింది తానేనని ఆయన గుర్తుచేశారు. పెద్దయెత్తున తరలివచ్చిన ముస్లింలతో కలిసి చంద్రబాబు కూడా సంప్రదాయ పద్ధతిలో నమాజ్ చేశారు.
ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ఆనందం కోసం నెల రోజుల పాటు పవిత్రంగా ముస్లిం సోదరులు ఉపవాసం పాటించారన్నారు. కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించి ప్రజలంతా ఆనందంగా ఉండేలా చూడాలని అల్లాను కోరుతున్నానని సీఎం తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం రూ.1100 కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించామని తెలియచేసారు.