సీఎం జగన్ సిమ్లాకు ఫ్యామిలీ టూర్ - సిల్వర్ జూబ్లీ పెళ్లి వేడుకలకు ముందు..

గురువారం, 26 ఆగస్టు 2021 (12:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ చేపట్టారు. ఒకవైపు పార్టీ అధినేతగా, మరోవైపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉండే సీఎం జగన్.. ఏమాత్రం సమయం లభించినా తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లారు. 
 
తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం తన ఫ్యామిలీతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరి వెళ్లారు. ఈ టూర్‌లోనే నత వ్యక్తిగత పనులను కూడా పూర్తి చేసుకోనున్నారు. 
 
సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. 
 
సీఎం జగన్​ వివాహం జరిగి ఆగస్టు 28కి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకూ ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబరు 1న ఆయన తిరిగి ఏపీకి రానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు