#Jagan 'భరత్ అనే నేను'లా 'జగన్ అనే నేను' చేస్తున్నారా?

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (20:40 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు ప్రిన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిష్కరించుకునేందుకు గాను పంచాయతీకి రూ. 5 కోట్లు కేటాయించి, వారి సమస్యలను వారే పరిష్కరించుకునే మార్గాన్ని చూపిస్తారు. తద్వారా గ్రామీణ ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీలపై ఆధారపడకుండా పనులు వేగవంతం అయ్యేట్లు చేస్తారు. దీనికి ప్రజలు జేజేలు పలుకుతారు. 
 
ఇదంతా ఎందుకయా అంటే... ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలాంటి గ్రామ స్వరాజ్యం వైపే అడుగులు వేస్తున్నారు. నవరత్న పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్లో స్పందించారు.
 
"గ్రామ స్వరాజ్యం దిశగా అడుగువేశాం. వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించాం. కనీస అవసరాలకోసం ప్రజలు ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ బాధ్యత వహిస్తారు. సంక్షేమ పథకాలను డోర్‌డెలివరీ చేస్తారు. గ్రామ సచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తారు.'' అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు