ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఎదుర్కునే క్రమంలో రూపొందించిన స్నేహ పూర్వకమైన ఈ ఐదు చేతి ప్రతులు ఉపయోగకరంగా ఉంటాయని, అక్రమ రవాణాను నివారించడంలో పాటు, సమస్యను పరిష్కరించడంలో మార్గదర్శకత్వం వహిస్తాయని అన్నారు.
జ్యుడిషియల్ ఆఫీసర్లు, ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, లేబర్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీ సంస్థల నిర్వహకులకు ఈ పుస్తకాలు సహాయకారిగా ఉంటాయన్నారు. హ్యాండ్ బుక్ ఆన్ కౌంటర్ హ్యూమన్ ట్రాఫికింగ్ పేరిట వీటిని తీర్చి దిద్దటం మంచి ప్రయత్నమన్నారు.
మానవ అక్రమ రవాణా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఉపకరించే విధంగా ప్రస్తుత చట్టాలు, విధానాలు, తీర్పులను ఈ పుస్తకాలలో సమకూర్చారని, నివారణ, రక్షణ, పునరావాసం, పున-సమైక్యత ఉద్దేశ్యంతో అక్రమ రవాణా, సంబంధిత నేరాలపై మార్గదర్శక కృషి చేసినందుకు సునీతా కృష్ణన్, ఆమె బృందాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.