గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. తర్వాత డిసెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం జూన్ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది.
ఇందులో భాగంగా దాదాపు 3లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్ ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.