ఆంధ్రాలో పాఠశాలల పునఃప్రారంభం మళ్లీ వాయిదా!

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (17:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం తేదీని మళ్లీ వాయిదావేశారు. నిజానికి అక్టోబరు ఐదో తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని సర్కారు భావించింది. కానీ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోమారు వాయిదావేసుకుంది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబరు 2న స్కూళ్లు తెరుచుకుంటాయి.
 
ఇక, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్‌ను సీఎం స్వయంగా విద్యార్థులకు అందజేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు