ఈ క్రమంలో తాజాగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆయన ఓ విజ్ఞప్తి చేశాడు. ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కోరాడు. 'పేద విద్యార్థులు ఫీజు డిపాజిట్ చేయనందుకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేయకండి. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వండి. మీరు చేసే ఆ చిన్న సాయం ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను కాపాడుతుంది. వాళ్లను మంచి మనుషులుగా చేస్తుంది' అని సోనూ ట్వీట్ చేశాడు.
ఇక మరో ట్వీట్ లో 'విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదు. ఫీజుల కోసం చదువుకునే విద్యార్థుల హక్కును హరించవద్దు అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. సోనూసూద్ ట్వీట్ చేసిన 30 నిమిషాల్లో, ఈ పోస్ట్‌ను 10,000 మందికిపైగా లైక్ చేయగా, 500 మంది కామెంట్స్ చేశారు. ఇక 2000 మందికి పైగా రీట్వీట్‌లు చేసారు.
అయితే, ఈ ట్వీట్‌కు ముందు సోనూసూద్‌ని ఒక అమ్మాయి సహాయం కోరింది. తాను చాలా పేదరాలునని, ఫీజు కూడా చెల్లించలేనని పరిస్థితి తనది అని వెల్లిడించింది. అయితే చదువుకోవాలనే కోరిక తనలో చాలా ఉందని, దానికి సహాయం కావాలని సోనూసూద్ ని సహయం కోరింది. ఈ క్రమంలో సోనూసూద్ ఈ పోస్ట్ చేశాడు.