ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లాక్‌డౌన్ సడలించింది. కొన్ని రంగాల్లో ఈ లాక్డౌన్ సడలింపులో భాగంగా, అదనపు మార్గదర్శకాలు జారీచేసింది.
ఈ సూచనల మేరకు ఆర్థిక రంగం, వ్యవసాయ రంగం, ఉద్యాన పనులకు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు, పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు, ఈ-కామర్స్ కంపెనీలు, వారి వాహనాలకు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు తెరిచేందుకు, కరోనా లక్షణాలు లేని వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంతూరులో పనిచేసుకోవచ్చు. మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లభించింది.