"అమరావతి" ఔట్ - కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు

సోమవారం, 4 ఏప్రియల్ 2022 (08:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న "అమరావతి" పాఠ్యాంశాన్ని తొలగించింది. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైందని, అందువల్ల విద్యార్థులపై భారంపడరాదన్న సదుద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు వెల్లడించారు. దీంతోపాటు వివిధ సబ్జెక్టుల్లోని మరికొన్ని పాఠాలను కూడా తొలగించినట్టు తెలిపారు. 
 
అయితే, ఎంతో చరిత్ర కలిగిన అమరావతి నుంచి సిలబస్ నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులపై భారం పడకూడదనుకుంటే పుస్తకంలోని చివరి పాఠాలను తొలగిస్తారు కానీ, రెండో పాఠంగా ఉన్న అమరావతిని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. 
 
కాగా, సోమవారం నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహా మిగిలిన పాఠాలు చదవుకుని సిద్ధంకావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు