నా జోలికొస్తే విశాఖలో లేకుండా చేస్తా : గంటాకు స్ట్రాంగ్ వార్నింగ్

సోమవారం, 2 సెప్టెంబరు 2019 (13:52 IST)
మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అన్నం పెట్టిన నోళ్లకు సున్న పెట్టే నైజం గంటా శ్రీనివాస్‍ది అని తీవ్రంగా వివర్శించారు. విశాఖ బీచ్ రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా అవంతి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివాలెల్తి పోయారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా చూడనంటూ గంటా ఇంకా మంత్రిననే భ్రమలోనే ఉన్నారని అవంతి ఎద్దేవా చేశారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలోనే ఉండకుండా చేస్తానని అన్నారు. 
 
గంటాను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశారు అవంతి శ్రీనివాస్. నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను చూసి వైసీపీ నాయకులే అవాక్కయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు