ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

ఠాగూర్

సోమవారం, 28 జులై 2025 (18:47 IST)
ఏపీలోని అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కింద విడతల్లో రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేస్తామని చెప్పారు. 
 
అలాగే, ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలోనే రూ.10 వేల ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. 
 
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు