ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి...

వరుణ్

బుధవారం, 19 జూన్ 2024 (15:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆయనకు శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ఫోన్ చేసి ప్రొటెం స్పీకరుగా వ్యవహించాలని గోరంట్లను కోరారు. పయ్యావుల ప్రతిపాదనకు బుచ్చయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ప్రొటెం స్పీకరుగా గురువారం ఆయనతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 
 
ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, స్పీకర్ పదవికి టీడీపీకి చెందిన మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన విషయం తెల్సిందే. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు