ఎన్నికల్లో ఏకగ్రీవాలను దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అన్నారు. అలాంటపుడు మన రాష్ట్రంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుంటే.. ఏకగ్రీవాలపై దృష్టిపెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా అంటారని వారిద్దరూ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఏకగ్రీవాలపై ఆయనకు ఏదో దురుద్దేశాలు ఉన్నట్టేనని చెప్పారు.
మంచి పరిపాలనకు కొందరు తూట్లు పొడుస్తున్నారని..,విభేదాల సృష్టి, వర్గాలను ప్రోత్సహించడం తెదేపాకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఏకగ్రీవాలపై దృష్టి పెడతామని ఎస్ఈసీ అంటే ఆయనకు దురుద్దేశాలు ఉన్నట్లేనన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలు దీన్ని ప్రోత్సహిస్తుంటే ఎస్ఈసీ ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ ఎవరికోసం, ఎందుకోసం చేస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు