ఏపీలో వైకాపా దుకాణం బంద్ అయినట్టే...: మంత్రి గొట్టిపాటి

ఠాగూర్

గురువారం, 11 సెప్టెంబరు 2025 (13:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా దుకాణం బంద్ అయినట్టేనని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ జోస్యం చెప్పారు. అనంతపురం వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సభకు రాష్ట్రం నలు మూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు భారీగా తరలివచ్చారని తెలిపారు. ప్రజల స్పందన చూసి జగన్‌కు అసహనం పెరిగిపోయిందని విమర్శించారు.
 
'ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్‌ నిరూపించారు. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్లే. యూరియా కొరతపై రైతు పోరు అంటూ వైకాపా హడావిడి చేసింది. ఆ పార్టీ ఐదేళ్ల పాలనలో ఒక్క పనీ చేయలేదు.. ఎవరైనా చేసినా ఓర్వలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేయాలన్నదే జగన్‌ లక్ష్యం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్నదే చంద్రబాబు ధ్యేయం. ఇద్దరి నాయకుల మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు' అని గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు