గుడ్ న్యూస్... ఏపీ సచివాలయాల్లో పాస్ పోర్టు సేవలు

సోమవారం, 2 మే 2022 (18:56 IST)
ఏపీ ప్రజలకు శుభవార్త. ఇకపై సచివాలయాల్లో పాస్‌పోర్టు సేవలు లభించనున్నాయి. ఏపీలోని జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో పాస్‌ పోర్టుతో పాటు పాన్‌ కార్డు, రైల్వే టికెట్‌ బుకింగ్‌ లాంటి సేవలు కూడా వీటిలో పొందవచ్చు.
 
ఎల్‌ఐసీ ప్రీమియమూ ఇక్కడే చెల్లించవచ్చు. ఇప్పటి వరకు 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొన్ని కమర్షియల్ సేవలు సైతం జత అయ్యాయి. 
 
రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 1600 సచివాలయాల ద్వారా అదనపు సేవలను అందిస్తోంది. ఇప్పటికే 98 మంది పాస్‌‌పోర్టు సేవలను వినియోగించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు