జనవరి 6 నుంచి 14 తేదీ వరకు, అలాగే రద్దీని బట్టి జనవరి 15 నుంచి 18 వరకు ఆయా బస్ డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. రానుపోను టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పది శాతం రాయితీని ప్రకటించింది.
గత యేడాదితో పోలిస్తే ఈదఫా ఆర్టీసీని ఆదరించే ప్రయాణికుల సంఖ్య 63 శాతం నుంచి 68 శాతానికి పెరిగినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గత యేడాది నవంబరు నాటికి 2623 కోట్ల రూపాయల మేరకు ఆదాయం రాగా, ఈ దఫా రూ.3866 కోట్ల మేరకు పెరిగినట్టు చెప్పారు.