శనివారం గో శాలలో ఆయన గో పూజ చేశారు. గోవు, దూడకు పసుపు, కుంకుమ, పూలమాలలు, నూతన వస్త్రాలు సమర్పించి శాస్త్రోక్తంగా పూజ చేశారు. అనంతరం గోవు, దూడకు దాణా,గ్రాసం అందించారు.
అనంతరం ఈవో అధికారులతో మాట్లాడుతూ, తిరుపతి, పలమనేరు గోశాలల నుంచి సుమారు 330 గోవులు, ఎద్దులు రైతులకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. రైతులు ఉచితంగా అందుకున్న గోవులు, ఎద్దుల పోషణకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేసి రైతులకు వివరించాలని చెప్పారు.
జెఈవో వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి.వెంకటనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.