పోలీసులు మొదట దానిని గుర్తుతెలియని శవంగా భావించినప్పటికీ, ఆ తర్వాత కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజుగా గుర్తించారు. డేవిడ్ రాజుకు, కేఏ పాల్‌కి మధ్య తలెత్తిన ఆస్తి తగాదాల కారణంగానే పాల్ డేవిడ్ రాజును హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు పలుమార్లు పాల్‌కి నోటీసులు పంపినప్పటికీ, కేఏ పాల్ స్పందించకపోవడంతో ఈసారి అరెస్ట్ వారెంటు జారీ చేసింది.