సంచలనం కోసం.. బిగ్ బాస్-3 హౌజ్‌లోకి రేణూ దేశాయ్?

మంగళవారం, 11 జూన్ 2019 (11:59 IST)
టాలీవుడ్‍‌లో ప్రస్తుతం బిగ్ బాస్-3 గురించే పెద్ద చర్చ జరుగుతోంది. మా టీవీలో బిగ్ బాస్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్-3 షోకు వ్యాఖ్యాతగా అక్కినేని నాగార్జునను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈసారి బిగ్ బాస్ -3 ద్వారా మంచి రేటింగ్ కొట్టేయాలని మాటీవీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేఏ పాల్, బండ్ల గణేష్‌లను సంప్రదించింది. కానీ వాళ్లిద్దరూ బిగ్ బాస్‌కు వచ్చేది లేదని స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో సంచలనం కోసం టాలీవుడ్ పవర్ స్టార్ మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె ఎస్ చెప్పారా లేదా అనేది తెలియాల్సి వుంది.

ఇకపోతే.. టాలీవుడ్ యాక్టర్ వేణు తొట్టెంపూడిని కూడా బిగ్ బాస్-3 హౌజ్‌లోకి తీసుకునేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు