ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ్యులు.
ఐలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులమతాలపై మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం సంతోషంగా ఉందన్నారు తిరుపతి ఆర్యవైశ్యులు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు, ఐలయ్య రాసిన పుస్తకాన్ని తగులబెట్టారు.