తిరుపతిలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఒక యువకుడు స్కూటర్‌పై వెళుతున్న యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా స్కూటర్‌పై యువతి వెళుతుండగా మరో స్కూటర్‌పై వెళ్ళి వేగంగా ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన యువతిని తిరిగి కొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో యువకుడు అక్కడి నుండి పరారయ్యాడు.
తిరుపతి కనకభూషణం లేఅవుట్‌లో నివశిస్తున్న ఒక యువతిని తనను ప్రేమించాలంటూ కడప జిల్లా చిట్వేల్‌కు చెందిన నవీన్ కుమార్ వేధించేవాడు. ప్రేమించేందుకు యువతి నిరాకరించింది. అంతకుముందు ఒకేచోట చదువుకున్నామన్న కారణంతో అతను వేధింపులను ఆ యువతి ఇంట్లో చెప్పలేదు. దీంతో ఈ నెల 2వ తేదీ ద్విచక్రవాహనంపై వెళుతున్న యువతిని మరో ద్విచక్రవాహనంతో నవీన్, తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి ఢీకొట్టాడు. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. మొదట్లో పోలీసులు యాక్సిడెంట్‌గా కేసు నమోదు చేశారు.
తనపై కేసు నమోదైందని తెలిసిన నవీన్‌కుమార్ వెంటనే బెయిల్ కూడా పొందాడు. ఇద్దరిపైనా నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేశారు. రెండవ నిందితుడు యశ్వంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్‌ను కూడా అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అతడు ఓ పార్టీకి చెందినవాడని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు. అందువల్లనే పోలీసులు అతడిని వదిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.