పోలీసులను కలవరపెట్టే వరుస రహస్య హత్యల నేపధ్యంలో టీజర్ మొదలౌతుంది. వారు ఎంత ప్రయత్నించినా హంతకుడిని పట్టుకోవడంలో విఫలమవుతారు. చివరి ప్రయత్నంగా టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్ ని ఆశ్రయిస్తారు.
నాని అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కట్టిపడేశారు. బ్రూటల్, కనికరంలేని పాత్రలో ఆదరగొట్టారు. అతని ఇంటెన్స్ ప్రజెన్స్, యాంగర్ టెర్రిఫిక్ గా వున్నాయి. ముఖ్యంగా ఓ సన్నివేశంలో అతను నేరస్థుడిని పొడిచి కత్తిని పైకి లాగడం, రూఫ్ పై రక్తం చిమ్ముడం - అతని పాత్ర క్రూరత్వాన్ని హైలెట్ చేస్తోంది.
సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ఇంపాక్ట్ ని మరింత పెంచుతుంది. ప్రశాంతి తిపిర్నేని, నాని ప్రొడక్షన్స్ వాల్యూస్ అత్యున్నతంగా వున్నాయి. ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు.