అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు- ఆ ఇద్దరికి ధన్యవాదాలు

సెల్వి

శనివారం, 22 జూన్ 2024 (12:19 IST)
Ayyanna Patrudu
అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి గెలిచిన అయ్యన్న పాత్రుడుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దాదాపు నలభై ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యన్న.. నాటి నుంచి పార్టీతోనే ప్రయాణించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. 
 
అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పీకర్ సీటులో కూర్చుండబెట్టారు. కాగా, సభాపతిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, స్పీకర్ పదవికి తనను ప్రతిపాదించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ????????.
స్పీకర్ పోడియం వద్దకు తీసుకు వెళ్లిన
సీఎం @ncbn డిప్యూటీ సీఎం @PawanKalyan గార్లు ????✊. pic.twitter.com/mFBS9Wr8c7

— Team PoliticalSena (@Teampolsena) June 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు