అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వైకాపా అధినేత జగన్ ప్రతిపక్ష నేత హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చన్నారు. తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాల సందర్శించిన సభాపతి.. మొక్క నాటారు. శాసనసభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామన్నారు.
ప్రతిపక్ష హోదా విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. జగన్‌తో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా విజయం సాధించిన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల వల్ల రాష్ట్రం నష్టపోయిందని.. కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని తెలిపారు.
జగన్ అసెంబ్లీకి వచ్చి, సార్ అని మైక్ అడిగితే... తప్పకుండా మైక్ ఇస్తా