జగన్‌కు షాకివ్వనున్న మాజీ మంత్రి బాలినేని... జనసేనలో చేరిక ఖాయమా?

వరుణ్

మంగళవారం, 16 జులై 2024 (09:54 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సమీప బంధువు, మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీ మారాలన్న తలంపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ పార్టీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఇంతకాలం తన పర్యవేక్షణలో ఉన్న ఒంగోలు జిల్లా వైకాపా బాధ్యతలను మరో సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ నిర్ణయంతో బాలిలేని తీవ్ర షాక్‌కు గురయ్యారు. దీంతో ఆయన తన అనుచరులతో ఈ విషయంపై చర్చించి ఒక కఠిన నిర్ణయం తీసుకోబుతున్నట్టు వినికిడి. ఎంతో రహస్యంగా జరిపిన ఈ భేటీ విషయాలు లీక్ కావడంతో బాలినేని పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో బాలినేని శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. 
 
వైకాపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దమ్ముంటే తనపై ప్రతీకారం తీర్చుకోవాలని, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేసారు. కార్యకర్తలపై దెబ్బ పడితే తనపై పడినట్టేనని చెప్పారు. గొడవలు ఎక్కువ అవుతాయన్న ఉద్దేశ్యంతో తాను మధ్యలో జోక్యం చేసుకోవడం లేదన్నారు. కానీ, అధికార పక్ష నేతలు చర్యలు దుర్మార్గంగా ఉన్నాయని వాపోయారు. 
 
"ఒకాయనేమో అబ్బాకొడుకులు పారిపోయారంటూ ఫ్లెక్సీలు వేస్తారు. బాలినేని జనసేన పార్టీలో చేరతాడంట అని ఓ జనసేన నేతతో చెప్పిస్తారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. మా పార్టీలో అవినీతిపరులను చేర్చుకోవం అని మరొకాయనతో మాట్లాడిస్తారు. జనసేనలో చేరడానిక మేం వెంటపడుతున్నామా? అసలు ఆ పార్టీలో ఎవరు చేరుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు