బుజ్జగించినా ఫలితం శూన్యం.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరుతారా?

సెల్వి

శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (10:04 IST)
సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరుతారని తెలుస్తోంది. దీంతో వైసీపీ షాక్ తప్పలా లేదు. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 
 
నేడో, రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.  జగన్‌కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. బాలినేనిని జగన్ బుజ్జగించినా ప్రయోజనం లేదు. దీంతో బాలినేని జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమని టాక్ వస్తోంది. 
 
2012లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బాలినేని పార్టీని వీడితే కచ్చితంగా జనసేనలో చేరుతారనే మాటలు ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు