తల్లిదండ్రులు తిట్టారని ఇంటి నుంచి వచ్చేసింది: ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న పూజారి ఏం చేశాడంటే?

మంగళవారం, 27 జూన్ 2017 (09:30 IST)
తల్లిదండ్రులు తిట్టారనే కోపంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన 17 ఏళ్ల అమ్మాయిపై ఓ ఆలయ పూజారి ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులోని తుముకూరు చిక్కనాయకన్ హళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  హోసూరు ప్రధాన రహదారిపై ఉన్న దేవాలయంలో దీపక్ (20) పూజారిగా పనిచేస్తున్నాడు. దీపక్‌తో సదరు అమ్మాయితో పరిచయం ఏర్పడింది. 
 
తల్లిదండ్రులు తిట్టడంతోనే ఇంటి నుంచి దుస్తులు, డబ్బుతో బయటకు వచ్చేసానని చెప్పింది. సాయం చేయమని దీపక్‌ను అడిగింది. దీన్ని అదనుగా తీసుకున్న దీపక్... ఆలయంలోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఉత్తుత్తి పెళ్లి చేసుకుని.., ఆలయం వెనకున్న తన గదిలోకి తీసుకెళ్లాడు. 
 
పెళ్లి కావడంతో ఇకపై మనమిద్దరం భార్యాభర్తలమని.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరోవైపు కుమార్తె కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఆమె వుండే ప్రాంతానికి వచ్చిన పోలీసులు దీపక్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి