భారీ వర్షాలతో బాపట్ల మాచవరం రైల్వే ట్రాక్ కుంగింది, రైళ్ల రాకపోకలకు ఆటంకం

ఐవీఆర్

సోమవారం, 14 అక్టోబరు 2024 (22:12 IST)
అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పొన్నూరుకి సమీపంలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీనితో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అదే మార్గంలో వెళ్లాల్సి వుంది.

ఐతే ట్రాక్ కుంగిపోవడంతో మాచవరం సమీపంలోకి వెళ్లిన వందేభారత్ రైలును వెనక్కి రప్పించి కొత్తగా వేసిన 3వ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్ వెళ్లేట్లు చేసారు. కాగా కుంగిన రైల్వే లైనుకి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షం అంతరాయం కలిగిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు