బంజారాహిల్స్‌లో ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి(28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఇంకా హెచ్‌ఆర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసిన శిరీష.. రాత్రి లేటుగా ఇంటికి వస్తానని తెలిపింది. అయితే ఇంటికి రాలేదు.
ఎప్పటిలాగే సతీష్ మంగళవారం బేగంపేటలోని తాను కుక్‌గా పనిచేసే ఆశ్రయ్-ఆకృతి పాఠశాలకు వెళ్లారు. ఇంతలో సతీష్ చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేసి వెంటనే శిరీష పనిచేస్తున్న ఫిలింనగర్‌లోని ఆర్జే ఫోటోగ్రఫీ కార్యాలయానికి రావాలని పిలిచారు. దీంతో సతీష్ అక్కడి వెళ్లి చూడగా.. శిరీష విగత జీవిగా కనిపించింది. ఆర్‌జే ఫొటోగ్రఫీ యజమాని వల్లభనేని రాజీవ్‌ను పోలీసులు ప్రశ్నించగా.. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని, తానే చున్నీని కత్తిరించి శిరీషను మంచం మీద పడుకోబెట్టానని చెప్పాడు.