భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది, అలిపిరి మెట్లెక్కి వెళ్తా: డిప్యూటీ సీఎం పవన్

ఐవీఆర్

మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (11:18 IST)
తిరుమల క్షేత్రంలో కొలువైవున్న తిరుమలేశుడి మహాప్రసాదం లడ్డూ అపవిత్రంపై మాట్లాడితే కొందరికి నవ్వులాటగా వుందని ఆగ్రహం వ్యక్తం చేసారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇలాంటివే ఏ మసీదుకో, చర్చికో జరిగితే మీరు వూరుకుంటారా... రోడ్లపైకి వచ్చి గోల చేయరా అని ప్రశ్నించారు.
 
ఆయన మాట్లాడుతూ... ''హిందువుల అంటే అంత చులకనా... జగన్-భూమన కరుణాకర్ రెడ్డి ఏ మతానికి చెందినవారో నాకు తెలియదు. కానీ శ్రీవారి లడ్డూ విషయంలో వారు చేసినది చాలా ఘోరమైన తప్పు. భూమన కరుణాకర్ రెడ్డి నాశనం మొదలైంది. లడ్డూ కల్తీపై భూమనతో పాటు వైవి సుబ్బారెడ్డి ఇద్దరూ విచారణకు హాజరు కావాలి. ధర్మారెడ్డి ఎటు వెళ్లారు... ఆయన హిందువైతే.. బిడ్డ చనిపోయిన 11 రోజుల లోపుగానే గుడికి వచ్చేస్తారా.
 

జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో...

నేనే గనుక సనాతన ధర్మంపై పోరాటం చేస్తే, నన్ను ఆపేవాడు ఈ దేశంలో ఎవడులేడు!!

AP Deputy CM @PawanKalyan garu. pic.twitter.com/A5Mk8MQtFU

— JanaSena Samhitha (@JSPSamhitha) September 24, 2024

విజయవాడ శ్రీ కనక దుర్గ ఆలయంలో శుద్ధి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు@PawanKalyan @JanaSenaParty @APDeputyCMO @HinduITCell pic.twitter.com/2wzdaFurGq

— Prasannakumar Nalle (@PrasannaNalle) September 24, 2024
సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోబోము. వైసిపి ప్రభుత్వాన్ని పడగొట్టిన మేము, మీరు ఏం చేస్తున్నా చూస్తూ కూర్చుంటామని అనుకుంటున్నారా. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఈ విషయం తమాషాగా వుందా. సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన కూడా సరిగా మాట్లాడాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ తెలియజేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు