బాబుకి పవన్‌కి మధ్య ఆ సంబంధం వుందని ఏపీ ప్రజలు ఆ పని చేశారు... రావెల కిశోర్

సోమవారం, 10 జూన్ 2019 (21:02 IST)
జనసేన పార్టీ నుంచి అలా బయటకు వచ్చి ఇలా భాజపాలో చేరిపోయారు రావెల కిశోర్ బాబు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన నాయకుల్లో తను కీలక నాయకుడునన్న మాటలో నిజం లేదని కొట్టిపారేశారు.
 
అసలు తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంటే దొరికేది కాదన్నారు. కనీసం ఫోనులోనైనా మాట్లాడుదామంటే ఆయన అందుబాటులో వుండేవారు కాదన్నారు. ప్రజలు జనసేన గురించి ఏమనుకుంటున్నారో చెప్పేందుకు కూడా సమయం కుదర్లేదంటూ చెప్పుకొచ్చారు. తన సూచనలు, సలహాలు ఆయన తీసుకున్న పరిస్థితులు కూడా లేనేలేవన్నారు. 
 
వైసీపి గెలవడానికి కారణం గురించి చెపుతూ... చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతూనే వున్నాయని ప్రజలు నమ్మారన్నారు. చంద్రబాబును పవన్ విభేదిస్తున్నట్లు జనం అనుకోలేదనీ, ఒకవేళ పవన్ కల్యాణ్‌కి ఓట్లు వేస్తే ఎక్కడ మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారోనన్న భయంతో వాళ్లంతా కలిసి వైసీపిని బంపర్ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు