పోలీసుల ఓవరాక్షన్ కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థంలోని బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన విషయం తెలిసిందే.
అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.