ఇదిలా వుండగా,, పవన్ కళ్యాణ్ చిత్రం హరిహరవీరమల్లు విడుదలకు సిద్ధమైంది. ఈనెలాఖరున రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకాబోతుంది. ఇప్పటికే యు.ఎస్.లో బుకింగ్ బాగున్నాయి అని నిర్మాత స్టేట్ మెంట్ ఇచ్చారు. తాజాగా హరిహరవీరమల్లు కు పెద్ద హైప్ లేదనే టాక్ కూడా నెలకొంది. అయితే ఆ సందర్భంగా బన్నీకి కాావల్సినవాడు, అల్లు అరవింద్ బంధువు అయిన నిర్మాత బన్నీవాస్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగబాబు కలిసి వున్న ఫొటోను షేర్ చేశారు. ఇది గతంలో ఫిలింఛాంబర్ లో ఓ ఇష్యూలో అందరూ కలిశారు.
ఆల్ ఇండియా బన్నీ ఫ్యాన్స్ అనే పేరుతో పోస్ట్ చేసిన దానిని బట్టి, హరిహరవీరమల్లు చిత్రానికి బన్నీ అభిమానులందరూ తమ మద్దతును అందించాలని మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము. స్టార్ పవర్ తగ్గినప్పుడు, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలిసి వచ్చి నిర్మాతలకు అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఐక్యంగా ఉండి నిర్మాతల కోసం మన పరిశ్రమ స్ఫూర్తిని నిలబెట్టుకుందాం అంటూ క్లారిటీ ఇచ్చారు.