ముఖ్యమంత్రి జగన్ కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు.. కన్నా

ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:19 IST)
విజయవాడలో బీజేపీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ సభ్యులు జీవిఎల్, సుజనా చౌదరి, సిఎం రమేష్, బిజెపి నేతలు, మురళీధర్, సునీల్ దియోధర్, హరిబాబు పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వాన్ని ప్రారంభీంచినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారు.. 2019 వరకు మోదీ చేసిన అభివృద్ధిని కప్పిపెట్టారు. మళ్ళీ మోదీ అధికారంలొకి వచ్చాక వాస్తవాలు తెలుసుకొని బీజేపీలో చేరుతున్నారు .
 
 
కాశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోనే అతి సులువుగా పరిష్కరించిన వ్యక్తి మోదీ
దేశ చరిత్రలో ఆగస్టు 15 ఎంత ముఖ్యమో ఆగస్టు 5, 6 తేదీలు అంతే ముఖ్యమని చెప్పారు. ఈ నెల 20వరకు బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులన్నీ పాల్గొనాలి.
 
ఏపీలో ప్రస్తుత ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని భావించాం. కానీ ముఖ్యమంత్రి ఆవేశం, అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 
 
గతంలో బీజేపీ నేతలను టీడీపీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అదే ధోరణిలో వెళుతున్నారు. ఈ నెల 16న గురజాలలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా, ఇసుక కొరత, రాయలసీమ కరువు వంటి అంశాలపై ధర్నాకు దిగుతున్నామని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు