తన ప్రమేయం లేకుండా వాట్సాప్ గ్రూపులో విజువల్స్ అప్ లోడ్ అయ్యాయని చెప్పారు. దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. జూలై 31న విజువల్ అప్ లోడ్ అయితే దానికి కావాలని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, దీనిపై మహిళా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కానీ చివరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్టణంలో చోటుచేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని అసభ్యకర మెసేజ్ పంపిన కేసు విచారణలో భాగంగా షీటీమ్ మహిళా కానిస్టేబుల్ స్నేహితకు అసభ్యకర సందేశాలు పంపిన నిఖిల్ కుమార్‌కు ఫోన్ చేశారు. వివరాలు అడుగుతున్న సమయంలో పరుష పదజాలంతో మాట్లాడాడు. ఆపై వేధింపులు మొదలెట్టాడు. దీంతో అతడిని షీ టీమ్స్ అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు.