ఇదేంటి శ్యామలా? కారుకి సపోర్ట్ చేస్తే కారు పోయింది, ఫ్యానుకి సపోర్ట్ చేస్తే ఫ్యానూ పోయింది

ఐవీఆర్

బుధవారం, 5 జూన్ 2024 (15:39 IST)
కర్టెసి-ట్విట్టర్
యాంకర్ శ్యామల. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైసిపి తీర్థం పుచ్చుకున్న దగ్గర్నుంచి జనసేన, తెదేపాలను ఉతికి ఆరేస్తూ వచ్చారు. అరవడం, ఆయాస పడటం తప్పించి పవన్ కల్యాణ్ సహాయపడినట్లు తను ఎక్కడా చూడలేదని ఎన్నికలు ఫలితాలు వచ్చే రెండు రోజులు ముందు అన్నారీమె.
 
ఇంకా ఏపీలో జనసేన చిరునామా వెతుక్కోవాల్సి వస్తుందనీ, తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పిన యాంకర్ శ్యామల, వైసిపి గెలుపు కోసం తను రాష్ట్రంలోని పలు ప్రధాన నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. ఆసక్తికరంగా యాంకర్ శ్యామల ఎక్కడైతే పర్యటించారో ఆ నియోజకవర్గాల్లోని అభ్యర్థులందరూ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. చూడండి యాంకర్ శ్యామల పర్యటించిన నియోజకవర్గాలు...

వైసీపీ ఘోర పరాజయం పాలైన సీట్లు లిస్టుpic.twitter.com/PT9q88xUPM

— Kishan (@kishan_Janasena) June 5, 2024

ప్రతి తెలంగాణ కుటుంబం ఆలోచన ఒకటే కారు గుర్తు కే మన వోటు#VoteForCar #TelanganaWithKCR #Telangana pic.twitter.com/JtvKeJZNiM

— Anchor Shyamala (@AnchorShyamala) May 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు