చెల్లెలు వరసయ్యే యువతిని గర్భవతిని చేశాడు.. వావి వరుసలు..?

శనివారం, 9 జనవరి 2021 (11:42 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా వావి వరుసలు లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా కామంతో కళ్ళు మూసుకు పోయిన యువకుడు చెల్లెలు వరసయ్యే యువతితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దెందులూరు మండలం అలుగుల గూడెం ప్రాంతంలో వరసకు సోదరి అయ్యే యువతి(19) పై, యువకుడు(21) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. యువతికి రుతుక్రమం తప్పడంతో ఆమెను తల్లిదండ్రులు నిలదీశారు. 
 
దీంతో ఆమె జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతిగా నిర్ధారణ అయింది. తల్లిదండ్రులు వెంటనే దెందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దెందులూరు ఎస్ ఐ రామ్ కుమార్ కేసు నమోదు చేసి, యువతి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు