చెన్నై సిటీ మైలాపూర్ లోని లాల్ ఎస్టేట్ ప్రాంతంలో నివాసముండే పళణి, మరియమ్మాల్‌లకు సంవత్సరం క్రితమే వివాహమైంది. కానీ పిల్లలు లేరు. పళణి తమ్ముడు సెంథిల్ స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే పళణి మాత్రం చదువుకోకపోవడంతో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు.