దాగుడుమూతల ఎంపీ బుట్టా రేణుకపై వేటుపడింది... నేడు టీడీపీ తీర్థం...

మంగళవారం, 17 అక్టోబరు 2017 (06:16 IST)
తుది శ్వాసవరకు వైకాపాలోనే ఉంటానంటూ ఒకవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తనవంతు ప్రయత్నాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ వచ్చిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కన్నెర్రజేశారు. ఫలితంగా ఆమెపై సస్పెండ్ వేటు వేశారు. 
 
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశమైనట్టు తెలుస్తోంది. ఆమెను సస్పెండ్ చేయడం వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతామని వైసీపీ నేతలు అనుకుంటున్నట్టు సమాచారం. కాగా, బుట్టా రేణుక భర్త ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
 
మరోవైపు, మంగళవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును రేణుక కలవనున్నారని, బాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. కర్నూలు జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుకకు టీడీపీ తరపున పోటీ చేసేలా ఆమె తన సీటును ఖరారు చేసుకున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు