త్వరలోనే టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ ద్వారా కొత్త సంస్థకు పనులు అప్పగించనుంది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎడమ ప్రధాన కాలువలోని 5-ఏ ప్యాకేజీ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎడమ ప్రధాన కాలువ పనులను 8 ప్యాకేజీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఐదో నెంబర్ ప్యాకేజీని సవీర్ డ్యాం వాటర్ వర్క్స్ కంపెనీకి గతంలో అప్పగించింది.
దాదాపు 181 కోట్ల 87 లక్షల రూపాయల విలువైన ఐదో ప్యాకేజీ పనులను ఆ సంస్థ చేపట్టింది. 2018 జూన్-జులైలో... పీఎస్కే-హెయిఎస్ భాగ్యస్వామ్య సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా ఆ పనులు దక్కాయి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ తవ్వకానికి సంబంధించి చేపట్టిన పనుల్లో దాదాపు 64 శాతం మేర... 117 కోట్ల 5 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తిచేశారు.