జగన్ తీరేంబాగోలేదు... అరెస్టు చేస్తామంటున్న సీబీఐ.. ఎందుకు?

శనివారం, 8 జులై 2017 (10:51 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఆయన వైఖరి ఇదే విధంగా కొనసాగిన పక్షంలో అరెస్టు చేయక తప్పదన వారు నిర్మొహమాటంగా చెప్పేశారు. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, పార్టీ ప్లీనరీకి సంబంధించిన సమావేశాల కారణంగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాలేక పోయారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కోర్టు విచారణ ఉన్న సంగతి ముందే తెలుసు కదా! అని జగన్ తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. 
 
ప్రతి ఒక్కరికి ఏవో పనులు, మీటింగ్‌లు ఉంటాయని... అంత మాత్రాన కోర్టు విచారణకు హాజరు కాలేమని చెబితే... కోర్టు విచారణ ఎలా ముందుకు సాగుతుందని జడ్జి నిలదీశారు. కోర్టు హాజరుకు మినహాయింపును కోరడానికి ఇది సరైన కారణం కాదన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని... లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి