ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రతిపాదనల కంటే ఎక్కువగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. భారీగా నిధులు కేటాయించింది. తద్వారా ఏపీ ప్రభుత్వం 2021-22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే ఎక్కువగా నిధులు వచ్చాయి.